ఆధరించు దేవుడు
ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికి శుభములు.
వేసవి కాలమంతా క్షేమంగా మనందరిని కాపాడి వర్షాకాలంలో ప్రవేశింప చేసిన యేసుక్రీస్తు ప్రభువుకు కృతఙ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. గడచినకాలం ఆధరించిన దేవుడు మీ జీవితంలో చేసిన మేలులను ఙ్ఞాపకము చేసుకొండి, ఎందుకనగా దేవుడు చేసిన మేలులకు మనము ఏమియు చెల్లించలేము, ప్రభువును ధ్యానించి స్తుతించే వారముగా ఉండాలని ప్రభువు మన కొరకు ఎదురు చూస్తున్నారు.
దానియేలు 6:10 లో భక్తి పరుడైన దానియేలు గురించి ఆలోచిద్దాము, రాజగు నెబుకద్నెజరు ఒక శాసనము ఇచ్చాడు, ఆ శాసనము దానియేలు తెలుసుకొన్నాడు అయినను సజీవుడైన దేవుని యందు విశ్వాసముంచి దానియేలు ఇంటికివెళ్ళి యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళూని తన ఇంటి పై గది కిటికీలు యెరుషలేము తట్టునకు తెరువ బడియుండగా తన దేవునికి ప్రార్థన చేయుచూ ఆయనను స్తుతించుచు వచ్చెను చూచారా? రాజశాసనమును కాక, సజీవుడైన దేవుని నిత్యం స్తుతించుచున్నాడు. తన భక్తిని దేవుని యందలి విశ్వాసమును విడువకయున్నాడు మరి మన జీవితములో దేవుడు ఎన్నో మేలులు చేస్తాడు, కాని చేసిన మేలులను మరచిపోతుంటారు.దానియేలు వలె దుఖః సమయములో, సంతొష సమయములో అన్ని సమయములయందు నీవు నమ్మిన దేవుడు, నిన్ను విడువడని ఎడబాయని దేవుడని స్థిరమైన విశ్వాసముతో స్తుతించండి. దానియేలు జీవితంలో ఆత్మీయ మేలు పొందుకొన్నాడు.
ఈ సమాచారం చదువుతున్న స్నేహితులారా! ప్రభు అనుభూతి పొందుచున్నారా?
అయితే విశ్వాసములో స్థిరముగా ఉండండి, దేవుడు ఆదుకొంటాడు.
దానియేలు 6:16 రాజ శాసనము దిక్కరించినందున దానియేలును సింహముల గుహలో పడవేశారు, భయము చెందని భక్తుడు దానియేలు గుహలో ధైర్యముగా ఉన్నాడు, కాని రాజుకు నిద్ర పట్టలేదు ఉదయముననే దుఖఃస్వరముతో జీవముగల దేవుని సేవకుడవైన దానియేలు అనిపిలిచాడు. దానియేలు యొక్క జీవితము చూచి అతను సేవించుచున్న దేవుడు నిజమైన దేవుడని తెలుసుకొన్నాడు, మన జీవితములో కూడా దేవుడు కనిపిస్తున్నాడా?
దానియేలు 6:24 దానియేలు మీద నిందమోపిన వారిని సింహముల గుహలో వేశారు, అయితే వారు గుహ అడుగునకు రాకమునుపే వారు సింహముల పాలైరి వారి ఎముకలను సహితము పగుల కొరికి పొడి చేసెను.చూశారా మనలను ఆధరించే దేవుని అశ్చర్య కార్యములు, నీవు నమ్మినట్లైనా అశ్చర్యకార్యములను అనుభవించెదవు.
అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక !