దీనమనస్సు

(1 పేతురు 5:6) దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి.

దేవుడు మనకు ఎప్పుడు ఏది అవసరము ఉంటుందో మనకంటే ఎక్కువుగా దేవునికి తెలుసు ఎప్పుడు ఎలా హెచ్చించాలో కూడా దేవునికే తెలియును, మనకు చిన్న సమస్య రాగానే ఎంతగానో కృంగిపోతాము మన బలిష్టుడైన దేవుని మరచిపోతాము.

ప్రాముఖ్యముగా దేవుని బలిష్టమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుట అనగా,

నమ్మక విశ్వాసము కలిగియుండాలి.

స్థిరమైన నమ్మకముతో ఉండాలి.

నేను సేవించుచున్న నా ప్రభువు లేదా నేను నమ్మిన నా ప్రభువు నన్ను విడువడు.

నాకేది అవసరము దేవుడు నా కొరకు నిర్ణయించిన సమయములో తన పద్దతి చొప్పున ఇవ్వగల సమర్ధుడు.

అని నిశ్చయత కలిగి ఆయన చేతిక్రింద దీనమనస్సు కలిగియుండాలి.

ప్రభువునకు కలిగిన మనస్సు కలిగియుండాలంటే ఎంతగానో నేర్చుకోవాలి. మన నడవడికను సరిచేసుకోవాలి, దీనులముగా ఉండాలంటే మానవజీవితములో ఉండే చెడుమార్గము పాప స్వభావము మనలో ఉన్న సమస్త కీడులనుండి మనలను మనము పవిత్రులుగా చేసుకోవాలి.

దీనమనస్సు ధరించుకోవాలి ప్రభువునందు భక్తి విశ్వాసం కలిగియుండాలంటే దేవుని వాక్యం మనలను సరియైన మార్గములో నడిపించును.

మనప్రభువు దీనుడును సాత్వికుడై యున్నాడు, కనుక ప్రభువును నమ్మిన, రుచి చూచిన ప్రతి యొక్క విశ్వాసి ప్రభువు వాక్కును గైకొని తగిన సమయం కొరకు ఎదురుచూస్తూ, విశ్వాస జీవితం జీవిస్తూ, బలిష్టమైన మన ప్రభువు చేతికింద దీనులమై, ప్రభువు అనుగ్రహించు ప్రతి ఫలదీవెనలు పొందుకొందుముగాక!

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *