దేవుని వాక్యము
ఎఫేసి 6:17 దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి.
ఆత్మ ఖడ్గమును ఉపయోగించుటకు ముందుగా సమస్త విధములైన ఙ్ఞానముతో కూడిన క్రీస్తు వాక్యము సమృద్ధిగా మన హృదయంలో నింపుకోవాలి, ఆత్మీయ స్థితిలో ఎదురయ్యే విషమ పరీక్షల్లో దేవుని వాక్యము ఉపయోగించాలి, అనగా మన హృదయంలో సమృద్ధిగా దేవుని వాక్కు చేత నింపుకోవాలి.ఇహలోకంలో ఖడ్గాన్ని ఎందుకు వాడతారు, అనగా ప్రాణాన్ని రక్షించుకోడానికి శత్రువును ఎదిరించుటకు ఆపద ఎదురైనపుడు, ఉపయోగించుటకు తమ దగ్గర భద్రపరచుకొంటారు.
దేవుని వాక్యము చేత యేసుప్రభువు అపవాదిని, ఎలా జయించినారు, మనకు మార్గము చూపినారు. మత్తయి 4: 1 -11 యేసుప్రభువు ఆత్మ ఖడ్గము, అనగా దేవుని వాక్కును ఉపయోగించి భయంకరమైన విషమ పరీక్షల్లో గెలిచి అపవాదిని ఓడించారు, యేసుప్రభువు మనుష్యకుమారుడుగాను శొధనకు గురియైనాడు దైవ కుమారుడుగా, అపవాదిని ఓడించి విజయశీలుడుగా అపవాది క్రియలన్ని లయం చేసినారు.
కావున విశ్వాసులు దేవుని వాక్యన్ని వాడగలిగే సామర్ధ్యాన్ని ఆయనే ఇస్తాడు సమృద్ధిగా హృదయంలో వాక్యం నింపుకొని అపవాది క్రియలను ఎదిరించుటకు వాక్యమను ఆత్మఖడ్గమును వాడాలి దేవుని వాక్కుచేత దుష్ట క్రియలు జయించి ప్రభువు చూపిన మార్గము అనుసరించి నడుచుకొందాము. దేవుని వాక్యమును ధరించుకొని అనగా మనహృదయం నిండా వాక్యమును భద్రపరచుకొని అపవాది వేయుచున్న అగ్నిబాణములను ఎదుర్కొని జయించి విజయం పొందాలి అట్టి కృప ప్రభువే దయచేయును గాక !