ప్రధానయాజకుడు
(హెబ్రీ 7:25) ఈయన తనద్యారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విఙ్ఞాపన చేయుటకు జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు.
యేసు క్రీస్తు ప్రభువు మన ప్రధానయాజకుడు యాజకులందరికంటే శ్త్రేష్టమైనవాడు. మన నిమిత్తము నిరంతరము విఙ్ఞాపన చేయుచున్నాడు.
క్రీస్తు యాజకత్యము శాశ్వతమైనది, ప్రభువును నమ్మిన ప్రతిఒక్కరి గురించి విఙ్ఞాపణలు చేయుచు తన పిల్లలను శాశ్వతముగా రక్షించ గలడు. ఎందుకనగా దేవునికి నరునికి మధ్యవర్తి మన ప్రభువైన యేసుక్రీస్తు మానవులమైన మన పాపాలకు ఒకే బలి అర్పణ అని అంగీకరించిన వారిని గురించి నిరంతరము విఙ్ఞాపన చేస్తూ రక్షిస్తాడు.
మానవులమైన మనము చేయవలసినది ప్రభువును అంగీకరించి కుమారుడైన యేసుక్రీస్తుద్వారా తండ్రియొద్దకు వచ్చి భయభక్తితో జీవించినపుడు క్రీస్తు తన బిడ్డల నిమిత్తము సంపూర్ణముగా శాశ్వతంగా రక్షించటానికి దేవునికి విఙ్ఞప్తి చేస్తూ ఉంటాడు. క్రీస్తు విశ్వాసులు రక్షణ స్తితిలో ఉండిపొతారు.
ఈ లోకంలో యాజకులు నిరంతరం జీవించువారు కారు మనము అడిగితే మాత్రమే విఙ్ఞాపన చేయుదురు కాని పరమతండ్రి నిత్యము మనగురించి విఙ్ఞాపన చేయును, కనుక మనమందరము ప్రభువు పాదాలచెంత వ్యక్తిగత విఙ్ఞాపణలు చేసికొని, గొప్ప శక్తిమంతుడగు ప్రధానయాజకుడు నా పక్షమున ఉన్నాడు అని విశ్వసించి రక్షణను కాపాడు కొందాము. మానవులము బలహీనులము ప్రభువు దేవుని కుమారుడు పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు. ఆయన వద్దకు వచ్చువారిని ప్రత్యేక మైన వారినిగా సిద్దపరచునుగాక.