ప్రధాన యాజకుడు
హెబ్రీ 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహనుభవము లేనివాడుకాడు గాని సమస్త విషయములలోను మన వలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను.
మనకు బలహీనతలు ఉండవలసిన వాటికన్న ఎక్కువగా ఉంటాయి ప్రతిపనులు చేస్తూ బలహీనపడిపోయి చింతిస్తూ, బాధపడుతూ కృంగిపోతుంటాము, మనలను ఎరిగిన మన ప్రధానయాజకుడు మన ప్రభువు మానవుల యొక్క భయభీతి దుఃఖ బాధలు అవసరతలు అన్ని యెరిగి తండ్రికి మన పక్షాన విన్నవించగల మన ప్రధానయాజకుడు యేసు క్రీస్తు.
భూలోకంలో మనుష్యులకు వచ్చే విషమ పరీక్షలన్నింటికి ప్రభువు కూడ గురి అయ్యాడు ప్రభువునకు మనవలె రక్తమాంసాలు నిజమైన మానవ స్వభావం ఉన్నాయి. ఆయన కూడా అపవాది చేత విషమ పరీక్షలు ఎదుర్కొన్నాడు. అన్నియును జయించి ఏ పాపము లేని వాడు అనగా ఆయన ఎప్పుడు పాపం చెయ్యలేదు ప్రతిదాని జయించి యున్నాడు , అంతే కాదు పరమ పవిత్రుడుగా ఉండినాడు.
మానవులము ప్రతి చిన్న దానికి కూడ బలహీన పడిపోయి పాపములో కూడ పడిపోతాము, దేవుడు లేని ప్రజలముగా ఉండిపోతాము ప్రభువు మనతో సహానుభవము కలిగి సమస్త విషయములలో శోధింపబడి అయినను పాపము లేని పరమ పవిత్రుడుగా ఉన్నాడు.
మరి మన ప్రధాన యాజకుని అడుగు జాడలు తెలుసుకొని ఆయన యందుండి నదుచుకొనవలెను.అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక!