శోభస్కరము
(కీర్తన 33: 1) నీతిమంతులారా మీరందరు ఆనందగానము చేయుడి.
స్తుతి చేయుట యధార్థవంతులకు శోభస్కరము, మన సృష్టికర్తయైన దేవున్ని మనము జీవితాంతము స్తుతించి ఘనపరచాలి. మనము స్తుతించుట వలన మనము దేవునితో ఉన్న సంతోషమును పొందుకొంటాము, దేవుని నుండి పొందుకుని సంతొష ఆనందం మనుష్యుల నుండి దొరకదు, దొరికినా క్షణకాలము మాత్రం ఉంటుంది. అదే పరలోక తండ్రిని స్తుతించి ఆనందిస్తే శాశ్వత ఆనందం ఉంటుంది.
మనతోటివారిని చాలసార్లు పొగడుతుంటాము, కాని ఈ శృష్టిలో వస్తువులు మనుష్యులు జీవులన్నిటిలో అందరికంటే మనప్రభువైన యేసుక్రీస్తు స్తుతులకు పాత్రుడు అన్ని నామములకంటే పై నామము కలిగి మార్పులేని ప్రభువు అందుకే మనము స్తుతించాలి దేవుని స్తుతించినపుడు మనకు తెలియకుండగనే ఆనందగానము చేస్తుంటాము అనగా ఆనందము ఎక్కడ నుండి వస్తుందంటే దేవుని నుండి తెలియని ఆనందము పొందుకొంటాము. దేవుని స్తుతించుట మనకు మేలు కొరకే, స్తుతి చేయుట యథార్థవంతులకు శొభస్కరము, కావున నీవు నేను దేవున్ని స్తుతించుట మరువకూడదు.
ప్రభువైన యేసుక్రీస్తు అన్నింటిలోకెల్లా యోగ్యుడుగా అర్థంచేసుకొని అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామమును నిత్యం పొగడి స్తుతించి ఘనపరచే వారముగా దేవునిలో ఎదగాలి.
దేవుని ఎరుగని వారున్నారు వారికి దేవుడు చేసిన మేలులు తెలుసుకోలేక, తృప్తిలేక దేవున్ని ఆరాధించరు, ఆధ్యాత్మిక సత్యాన్ని గ్రహించినవారు అనగా యధార్థవంతులుగా దేవున్ని నిత్యం స్తుతించి ప్రభువునందు ఆనందించి శోభస్కరమైన జీవితం జీవించి అనేకులకు ఆదర్శంగా ప్రభువునకు మహిమకరముగా ఉన్నవారు దేవునికి అతిప్రియులుగా ఉంటారు.