సమృద్ధి

ధనసమృద్ధి కలవారి ఆలోచన విధానములో చాలా మార్పులు కలిగి యుంటారు వారిలో దేవునికి స్థానం ఉండదు. దేవుని కలిగిన వారి ఆలోచనలు ఆయన చిత్తనుసారంగా ఆలోచిస్తారు, మనలో మనము ఎలాయున్నాము.

లూక 12:19 ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది సుఖించుము, తినుము, త్రాగుము సంతొషించుమని చెప్పుదునను కొనెను, అయితే దేవుడు వెర్రివాడా, ఇతని గుణము ఆలోచనలోనే కనబడుచున్నది. ఇవన్నియు దేవుని దయవలన పొందుకున్నవని చెప్పుటలేదు, దేవునికి కృతఙ్ఞతలు చెల్లించుట లేదు, దేవుని సేవకై వాడుట లేదు కాని స్వార్థంతో స్వప్రయోజనముతో తన సుఖాలను గురించి తానే మాట్లాడుకొంటున్నాడు. మనిషిలోని ఆలోచన ఎరిగిన దేవుడు పిలుస్తూ హెచ్చరిస్తున్నాడు. ఇలాంటి ఆలోచన గలవారిని పేరు పెట్టి పిలువడం లేదు. ఆ పిలుపు ఎంత భయంకరముగా ఉన్నది కదా!

మనమందరము చాల జాగ్రత్తగా యుందాము మనకు సమస్తము దేవుడు దయచేయుచున్నాడు. కనుక అందరము దేవునికి భయపడి దేవుడు మనకిచ్చిన సమృద్ధికి ఆయనకు కృతఙ్ఞతా స్తుతులు చెల్లించుచు ఇహలోక సంబధమైన సంపదల కంటే ఎన్నోరెట్లు శ్రేష్టమైనవి అని మన హృదయ పలకమీద భద్రపరచుకొని దేవుడు ఇచ్చిన సమృద్ధిని సమస్త ఈవులను బట్టి తండ్రికి వందనములు చెల్లించు కొంటూ దైవ దీవెనలు పొందుకొందాము.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *