ఆయన సన్నిధిలో
కీర్తన 105:4
యెహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి.
దేవునిని వెదకుట అనగా ఆయన ఎల్లప్పుడు మనతోనే ఉంటాడు, ఆయన సర్వాంతర్యామి. మనము ఆయనను విడిచి మరచిన వేళ ఒంటరి జీవితం కొనసాగించుకొంటాము. అనుకోని పరిస్తితులను ఎదుర్కొంటాము, కష్టాల పరిస్తితిగుండా పయనిస్తాము, సంతొషంలేని జీవితం గడుపుతాము.
దేవునిని వెదకి కనుగొనిన యెడల ఆయనతో నడిచేవారముగా ఉంటూ దేవదేవుని బలము పొంది నూతన సంతొషమును పొందుకొంటాము, అంతేకాదు ప్రాముఖ్యముగా దివారాత్రులు ఆయన సన్నిధిని వెదకుచు సంతోషకరమైన జీవితమును అనుభవిస్తూ నిత్యము ఆయన సన్నిధి, అనుభూతిని పొందుకొంటాము.
దేవునిని వెదకు వారికి తన్నుతాను వెల్లడి చేసుకోవడం దేవునికి ఇష్టం కనుక అందరు మరువక విడువక దేవదేవుని వెదకి వెంబడించుచు దైవబలము పొందుకొంటూ ఇహలోకాను సారమైన వాటిని జయించుచు ఆయన సన్నిధిలో నిరంతరము కొనసాగాలని ప్రభువు మనకొరకు ఆశిస్తున్నాడు. మరి మనమందరము కూడ గొప్ప తీర్మాణము తీసుకొని ఆయన సన్నిధి, దీవెనలు పొందుకొందాము.