దేవుని జనులు
2దినవృత్తాంతములు 7: 14
నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును.
దేవునికి ప్రియమైన జనులుగా (పిల్లలుగా) ఉండాలని అందరము ఇష్టపడుతాము అయితే ఆయన పిల్లలుగా ఎలా ఉండాలో వాక్యం మనకు బోధించుచున్నది.
1. మనలను మనము తగ్గించుకొని దేవుని సన్నిధానములో దీనులమై ఉండాలి, మన సృష్టి కర్తయైన దేవున్ని హెచ్చించుచు ఆయన సంఘ సహవాసములో ఉండాలి.
2. చెడు మార్గములను, చెడునడవడిని చెడు స్వభావము చెడుక్రియలు కలిగిన ప్రతిదీ విడచి, ప్రార్ధించాలి వాక్యధ్యానము చేయాలి. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడ పవిత్ర జీవితము అలవరచుకొని శుద్ధ హృదయముతో దేవుని ఆరాధించినపుడు దేవుని పేరు పెట్టబడిన పిల్లలముగా ముద్రించబడుతాము అప్పుడు మన ప్రార్ధన విని క్షమించి స్వస్తపరచి ఆశీర్వదించును.
కీర్తన 51:17 ప్రతివారిలో పాపం నిమిత్తం నిజమైన పశ్చత్తాపం ధుఃఖము కలిగితే ఆ పాపిని దేవుడు క్షమిస్తాడు, స్వీకరిస్తాడు. పశ్చాతాపము లేకుండా ఏ విధమైన బలి అర్పణ ఆయనకు ఉపయోగం లేదు పాపము విడచి పెట్టాలి , తరువాత దేవుని స్తుతించుటకు హృదయపు తలుపులు తెరచి దేవున్ని ఘనపరచాలి, దేవుని జనులుగా పిలువబడె అర్హతను పొందుకొంటాము.