భారము భరించువాడు
కీర్తనలు 68:19 ప్రభువు స్తుతి నొందునుగాక అనుదినము ఆయన మాభారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణ కర్తయైయున్నాడు.
మనప్రభువు స్తుతులకు పాత్రుడు ఆయన అత్యున్నతుడు, ఉన్నతమైన సింహసనము నందు ఆసీనుడైయుండే ప్రభువు మన అందరిని అమితముగా ప్రేమించి ఈ పుడమిపై అరుదెంచినారు. అంతమాత్రమే కాదు గాని మనలను వెదకి రక్షించి అనుదినము మన భారము భరించుచున్నాడు.
భూలోక రాజులను చూచినట్లైన రాజులు ప్రజలపై భారము మోపుతారు, కాని మనప్రభువు రాజలకు రాజు ఆ రాజులకు రాజైన ప్రభువు మన భారము భరిస్తున్నారు. మనయొక్క పాపభారము తీసివేస్తాడు, అలాగే అనుదినము అనగా ప్రతిదినము మన ఆర్థిక భారము అన్నవస్త్రముల, అస్వస్థత ఆరోగ్యము అన్నింటిపై మనపట్ల మన ప్రభువు భారము భరించుచున్నాడు.
ఎందుకనగా మనదేవుడు రక్షణ కర్తయై యున్నాడు, నిత్యము మనలను రక్షించుటకు ప్రయాసపడుతూ మన అనుదిన భారము భరించుచున్నాడు. కనుక ఈ లోక పాప భరితమైన మన జీవితములకు నెమ్మది కలిగించునది ప్రభువు ఒక్కడే. కావున ప్రభువును స్తుతించుచు మన సమస్త భారము ప్రభువునకు అప్పగించి, ఆధ్యాత్మిక స్తితిలో రాజులకు రాజైన ప్రభువు వైపు చూచుచు ఈ లోక జీవిత యాత్రను కొనసాగించుదాము.
అట్టి కృప ప్రభువు మన అందరికి కలుగ చేయును గాక!