కృతఙ్ఞతా స్తుతులు చెల్లించుడి
ఎఫేసి 5:20 మన ప్రభువైన యేసు క్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతఙ్ఞత స్తుతుతులు చెల్లించుచు.
ప్రభువును విశ్వసించే మన మందరము మన యెడల దేవుడు చేసిన ప్రతి విధమైన మేలులు, ఉపకారములు తలంచుకొంటూ, తండ్రికి స్తుతి చెల్లించు కోవాలి, మనము గ్రహించలేని సంగతులు మనజీవితంలో చేస్తూ మన జీవితాలను నడిపించుచున్న తండ్రికి కృతఙ్ఞతా స్తుతులు చెల్లించాలి. అనుదినము అన్న వస్త్రములచే పొషించుచున్నాడు, గనుక దేవునికి కృతఙ్ఞతా స్తుతులు చెల్లించాలి.ఈ జీవిత ప్రయాణములో వెన్నంటి యుంటూ మన ఆయుష్షు పొడిగిస్తూ మనము ఊహించలేని గొప్పకార్యములను అనుభవించే కృపను ఇస్తున్నందులకు తండ్రికి ఎల్లప్పుడు కృతాస్తుతులు చెల్లించాలి.
1 థెస్స 5:16 ప్రతివిషయమునందు కృతఙ్ఞతా స్తుతులు చెల్లించుడి.
అన్ని పరిస్తితులలోను అంటే సంతోష సమయములలోను, దుఖఃంలోను అన్ని పరిస్తితులలో కృతఙ్ఞతా స్తుతులు చెల్లించటం నేర్చుకోవాలి. అవిశ్వాసులు నాకెందుకిలా అయ్యింది అని తండ్రికి దూరం అయిపోతారు, విశ్వాసమును కొల్పోతారు.
మనకు తెలియకుండగనే విశ్వాసులందరు అన్ని పరిస్తితులలో దేవునికి కృతఙ్ఞత కలిగి యుంటారు, మానవ జీవితంలో అన్నింటిని ఎదుర్కోఅవాలి, ఎదుర్కొన్నదానిని బట్టి తండ్రికి సమీపముగా ఉంటూ తండ్రి చేత ఆధరింపబడాలి. తండ్రి చిత్తమును గ్రహిస్తూ తండ్రికి తగిన పిల్లలముగా ఉండునట్లు ప్రభువు నడిపించునుగాక!