సర్వశక్తి గల దేవుడు

ఆది 17:1 అబ్రాము తొంబది తొమ్మిది యేండ్లవాడైనపుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను; నా సన్నిధిలో నడుచుచూ నిందారహితుడువై యుండుము.

దేవుడు తన్నుతాను ప్రత్యక్షపరచుకొని అబ్రాముతో మాట్లాడినాడు.

1. మొదటిగా నేను సర్వశక్తి గల దేవుడను అన్నాడు, నిజముగానే మనదేవుడు సర్వశక్తుడు, అనగా అసాధ్యాలను సాధ్యం చేయగలడు, తన వాగ్ధానములను నిలబెట్టుకోగలడు, తన పిల్లలకు ఏమి చెయ్యాలను కుంటాడో చేయగల అన్నిటికి చాలిన దేవుడు.

2. కాబట్టి నాసన్నిధిలో నడుచుచు అనగా దేవునికి ప్రియమైన వాడు గా ప్రవర్తన యందు మాట యందు క్రియల్లో కూడ దేవుని సన్నిధిలో నడుచుకోవాలి

3. నిందారహితుడవై యుండుము అనగా దేవుని సన్నిధిలో మెలగడం దేవుడిచ్చిన క్రమపద్ధతులు గైకొని ఆయన సన్నిధిలో ఉంటూ దేవుని బలం మీద ఆధారపడి ఉండాలని ఉపదేశించాడు. అనగా దేవునిపై నమ్మకం ఉంచిన వారంత కూడ ఆయన సన్నిధిలో నడచుచు నిందారహితంగా ఉండాలి.

అలనాడు దేవుడు అబ్రాముకు ఇలా వివరించాడు, ఈనాడు మనకు కూడా వర్థిస్తుంది, మనము కూడా మన దేవుడు సర్వశక్తి గల దేవుడు ఆయన సన్నిధిలో నడుచుచు నిందారహితంగా ఉండి దేవుని వైపు చూచుచూ ఆ సర్వశక్తుని యందలి విశ్వాసాన్ని కాపాడుకొని అబ్రాము వలె దేవునిపై నమ్మకం విశ్వాసం కలిగి యుందుముగాక !

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *