సిద్దమనస్సను జోడి

ఎఫెసి 6:15 పాదములకు సమాధానసువార్తవలనైనసిద్దమనస్సను జోడు తొడుగుకొని నిలువబడుడి.

పౌలుగారు ఆధ్యాత్మిక పాఠాలు నేర్పుచున్నారు, సిద్దమనస్సను జోడు ఎందుకనినా అపవాదిని ఎదిరించుటకు ధైర్యంగా నిలువబడుటకు అధ్యాత్మిక పాదాలకు శుభవార్త అనే చెప్పులు తొడుగుకొని, శుభవార్తను అర్థం చేసుకోవాలి, నమ్మాలి,విశ్వసించాలి, వాక్యన్ని ప్రేమించి అనగా దేవున్ని ప్రేమించాలి. మన జీవితాల్లో కూడా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, ఆ ప్రభువు శాంతి, సమాధాన ధాతగా మనకుంటారు.

మనకు సమాధానము ప్రభువే విశ్వాసులకు ఇతరులకు మధ్య సమాధానము ప్రభువే మనందరి ఐక్యతకు కూడ నాంధి ప్రభువే సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవాలి.

దైవ్యవాక్యంలో సువార్త ప్రకటించు వారిపాదములు సుందరములు అని వ్రాయబడినది అందువలన ప్రభువును సర్వాంగకవచముగా ధరించాలి.ప్రభువు మనకు మాదిరికరముగా ఉన్నాడు శిష్యుల యొక్క పాదములు కడిగినాడు మనకొరకు తన్నుతాను తగ్గించుకొని పరిచారము చేసినాడు.

సమాధాన సువార్తవలనైన సిద్దమనస్సను జోడు తొడుగుకొని శుభవార్త అనగా మనప్రభువును ధరించినవారై అనేకులకు మాదిరికరముగా జీవించి దైవదీవెనలు పొందుకోవాలి.

ప్రాముఖ్యముగా మానవ జీవితములలో వస్తున్న శొధనలను ఎదిరించుటకు సిద్దమనస్సను జోడు తొడుగుకొని ఎదిరించి విజయ శీలురుగా నిలువబడాలి.అట్టి కృప ప్రభువు మనకు దయచేయునుగాకా!

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *