విశ్వాసమను డాలు

ఎఫెసి 6:16   ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు.

మనము శరీరరీత్యా బలహీనులుముగా ఉన్నప్పుడు డాక్టర్ ఏమందులు వాడమనిన తప్పకుండ అన్ని వాడుతాము. ఎందుకు అంటే మందుల వలన కాస్త శక్తిమంతులము అవుతామని ఆశ, మానవులముగా అందరము లోక సుఖం, సంపద, సౌఖ్యం కోరి అన్ని జరిగిస్తాము అన్ని మంచివే కాని ఒక్కటి మరచిపోతాము.

అది ఆధ్యాత్మిక పోరాటము గురించి మరచిపోతాము, అందుకే భక్తుడు గుర్తు చేస్తున్నాడు, ఆత్మీయ జీవితానికి విశ్వాసమను డాలు అవసరం మనకు తెలియకుండగనే అపవాది వేయుచున్న అగ్నిబాణములను అడ్డుకొవడానికి మన ఆత్మీయ జీవితానికి ఆటు పోటు తగలకుండా విశ్వాసమను డాలు కాపాడుతుంది. అంతేకాదు వస్తున్న ప్రతి శోధనను ఎదుర్కోవాలంటే దేవుని యందలి విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలి.

మనకు తెలిసినట్లుగా అబ్రహాము, హానోకు ఇంకా చాల మంది భక్తులు ఉన్నారు విశ్వాసులందరు సామాన్యులు గొప్ప మహానుబావులుకాదు. కాని వీరందరు దేవున్ని నమ్మి విశ్వసించారు. వీరి గొప్ప విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టులుగా మహనీయులుగా మనకు మార్గదర్శులుగా పరిశుద్ధ లేఖములలో విశ్వాస వీరుల పేర్లు ముద్రించబడినవి.

విశ్వాసులు క్రీస్తులో గట్టి నమ్మకం చేత ఎదుర్కోగలిగితే దేనినైన జయించగలము. వ్యాధి, బాధలు పరీక్షలు ఎదురైనప్పుడు నాకే వస్తునాయి అని అనుకొంటారు, ఇంకను బలహీనపడిపోతారు కాని (అది నిజంకాదు) విశ్వాసులందరికి ఎదురౌతున్నవి ఇవన్నియు జయించిన పౌలు గారు ధైర్యంగా ఇట్లు అంటున్నారు ” నా విశ్వాసమును కాపాడుకొంటినిమరి మనము కూడ మన విశ్వాసమును కాపాడుకొని దైవదీవెనలు పొందుకొందాము.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *