చింతయావత్తు
(1 పేతురు 5:7) ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింతయావత్తు ఆయన మీదవేయుడి.
మానవులలో ఏదో ఒకరకమైన చింతద్వారా ఎప్పుడు నిరుత్సాహములో జీవితాలను కొనసాగించటం అలవాటు చేసుకొనియుంటారు, వాక్యం చదివినప్పటికిని ధ్యానించినప్పటికిని దేవునిపై భారము వేయకుండ ఇంకా అనేకమైన ఆలోచనలతో ఉంటారు.
దేవున్ని విశ్వసించుతూ విశ్వాసప్రేమలతో జీవిస్తూ దేవునియందు భయభక్తి కలిగి యుంటూ మరొక ప్రక్క ఈలోకానుసారమైనచింతద్వార బలహీనులగుచుంటారు.
మనందరి గురించిన ఆలోచన మన పరమతండ్రికి ఎల్లప్పుడు మనగురించిన ఎర్పాటులు చేస్తూ మనల్ని చూచుకొనుటకు ఎల్లప్పుడు వేచియుంటాడు. ప్రతి తండ్రి తన పిల్లల నిమిత్తమై ప్రయాసపడినట్లుగా పరలోకపు తండ్రి అంతే కాదు మన సర్వసృష్టి కర్త మనగురించిన శ్రద్ద తీసుకుంటూ మనపై జాలితో చూస్తూ ఉంటాడు.
ప్రభువు మనకు అవసరమైన దానితో తృప్తి పరచుటకు సిద్ధంగా ఉంటాడు మరి మనము అది కాదు ఇదిచెయ్యాలి అను కొని దేవుడిచ్చిన అవకాశమును కాస్త ప్రక్కనబెట్టి మనకు తగని దాని కొరకు వేచి చూచి నిరుత్సాహముతో ఉంటాము, ఉన్నది పోయింది, ఉంచుకొన్నది పోయింది అన్నట్లు ఏది పొందుకోకుండ సతమతమౌతారు.
కనుక మిమ్మును గూర్చి చింతించే దేవుడున్నాడు, చింత యావత్తు ఆయన(దేవుని) మీద వేయుడి. అని భక్తుడు మనకు బోధిస్తున్నాడు, మనకు సమస్తము ధారాళముగా దయచేయుదేవున్ని మరచి ఆయనను అగౌరపరచి ఇబ్బందులు కొనితెచ్చుకొనుట మాని నిత్యము నా కొరకు ఎదిరి చూసే తండ్రి సన్నిధికి చేరి మన మానవులు తండ్రికి విన్నవించుకొని విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుదాము.