ప్రభువు దృష్టికి

(2 పేతురు 3:8) ప్రియులారా ఒక సంగతి మరచిపోకుడి ఏమనగా ప్రభువు దృస్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెను వెయ్యిసంవత్సరములు ఒకదినము వలెను ఉన్నవి.

ప్రభువు దృష్టికి మానవ దృష్టికి ఎంత వ్యత్యాసము కదా – భూమికి – ఆకాశము ఎంత ఎడమో, తూర్పు – పడమరలు ఎంతదూరమో. అలాగే ప్రభువు దృష్టి మానవ దృష్టి కూడా అంతే దూరము మన దృష్టి ఎంత అల్పమో చూశారా? అందుకే మనతోటి వారిని కూడా సరిగా అర్థం చేసుకోలేము. (తర్వాత అంటాము అయ్యో ఎందుకు అలా చేసాను అని అనుకొంటాము.)

మరిమన సృష్టికర్తను ఎలా అర్థం చేసుకొంటారో అని దేవుడే అనేకమంది భక్తులను మనముందుపెట్టి పరిశుద్ధ లేఖనము ఉపదేశిస్తున్నారు. అయితే, ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెను అనగా మానవ దృష్టికి వెయ్యి సంవత్సరముల వలె, అనగా ఆ వెయ్యి సంవత్సరములో ఎన్ని తరాలు గతించిపోవుచున్నావో కదా? అయినను ప్రభువు కాలమును లక్ష్యపెట్టక మానవులను లక్ష్యపెట్టుచున్నాడు.

అందరు ప్రభువు తట్టు చూడాలని ఒక్కరు నశించి పోకుండ అందరు మారు మనస్సు పొంది మనమందరము ప్రభువు పిల్లలముగా మారాలని ప్రభువు ఆ ఒక్క దినము మనకు వెయ్యిసంవత్సరములవలె అనగా, కాలములు మనము లెక్కిస్తాము కాని ప్రభువు కాలములను కాకుండా మానవులకొరకు చూస్తున్నారు.

అందుకే భక్తుడు అంటున్నాడు ప్రియులారా ఒక సంగతి మరచిపోకుడి, ఎంటి అంటే, మనమందరము నూతన స్వభావము కలవారమై ప్రభువు వచ్చు వేళ సిద్ధపడి యుండుటకు వెయ్యిసంవత్సరములను ఒకదినమువలె చేసుకొని ప్రభువు మనందరికొరకు ఎదిరిచూచుచున్నాడు. మరి మనమందరము పరలోక రాజ్యం స్వతంత్రించుకోవాలంటే ఈ లోకరాజ్యంలో సిద్ధపడాలి, ఆ సిద్ధపాటు కలిగియుందుముగాక!

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *