ఉచితమైన ప్రేమ

(2 కొరింథి 8:9) మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా ఆయన ధనవంతుడై యుండియు, మీరు తన దారిద్యము వలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను.

మన ప్రభువైన యేసుక్రీస్తు మనందరికొరకు దరిద్రుడైనాడు, మనపట్ల తనకున్న ప్రేమను చూపించుటకు పరిపూర్ణమైన కృపచూపుటకు తనదంతయు మనకు ఇచ్చినాడు ప్రాముఖ్యముగా పరమ పవిత్రుడైన ప్రభువు అత్యున్నత మైన సింహాసనము విడచి మనల్ని ప్రేమించుట ద్వారా పరిశుద్దుడు పరిశుద్ధ స్థలము విడిచి భూలోకమందు అరుదెంచినాడు.

విశ్వాసులందరికి ఆదర్శముగా నిలిచాడు, మన పాపమనె శిక్షను, దారిద్రతను తన భుజములపై వేసుకొని తన్నుతాను రిక్తునిగా చేసుకొని బలి అర్పించుకొన్నాడు. సిల్వలో గొప్పత్యాగం చేసి ఘోర భయంకరమైన శిక్షను సహితము భరించుటకు మనపై తనకున్న ప్రేమను వెల్లడి పరచాడు పనప్రభువు.  మనకొరకు వ్యాధి ననుభవించాడు, మనకొరకు దరిద్రుడయ్యాడు.

మనకొరకు తనకున్నదంతయు వదులుకొన్న క్రీస్తుప్రేమను గుర్తించారా?

యేసుక్రీస్తు పాపులమైన మనస్థానములో మరణించి సమస్తము వదులుకొని మనకు పాపవిముక్తి కలిగించి రక్షణ అనే ఐశ్వర్యము మనకందించి మనదరిద్రమును ఆయన సొంతం చేసుకొని అమూల్యమైన ప్రేమను గుర్తించి దేవుడు మనకు అందించిన రక్షణ అనే ఐశ్వర్యమును కాపాడు కుంటూ మన ప్రాణాత్మ దేహములను ప్రభువునకు సమర్పించి ఉచితమైన ప్రభువు ప్రేమను ఉన్నతమైన దేవుని కృపను పొందుతూ లోకయాత్రలో ప్రభువునకు ఇష్టమైన పాత్రగా కొనసాగుదుముగాకా!

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *