సూర్యుడు అస్తమించువరకు
(ఎఫెసి 4:26) కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచి యుండకూడదు.
ఎందుకనగా దేవునికి దూరం అవుతాము అలాగే అన్ని మానవ సంబంధాలకు దూరం అవుతాము ఎప్పుడు చిరాకుగా ఉంటాము అందుకే కోపములో నిలిచి యుండకూడదు.
అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు మానవశరీరములో కూడా ఉష్ణోగ్రత పెరిగి మానవులలో కోపాన్ని పెంచును, అందుకే వేసవిలో శరీరం చల్లగ ఉండునట్లు జాగ్రతలు తీసుకొంటారు. మానవులలో కొన్నిరకములుగా కోపాన్ని కనపరచుకొంటారు. కొందరు కోపం వచ్చినపుడు ఎక్కువగా మాటలాడుతూ ఎదుట వ్యక్తిని కూడా కోపానికి గురిచేస్తారు. మరికొందరు నిశబ్దంతో అనగా మాటలాడకుండా సాధించుకొంటారు ఇంకొందరు తమ్మునుతాము గాయపరచుకొంటారు వారికి వారే నష్టం జరిగించుకుంటారు.
కొందరు ఎదుటి వారిపై కోపం ప్రదర్శిస్తూ అంతా మీవల్లే అని శత్రువులుగా మారిపోతుంటారు, అంతే కాకుండా మానసిక వేదనకు గురికావచ్చు లేదా శరీరమును కృంగదీయవచ్చు అందుకే అంటారు
తన కోపమె తన శత్రువు!
తన శాంతమే తనకు రక్ష!
దేవుని ప్రేమ మనలో ఉంటే ఇవన్నియు నియంత్రణ చేసుకోవచ్చు అనగా మనము కోపము వలన పాపము చెయ్యకూడదు. సూర్యుడస్తమించువరకు మన కోపం తగ్గించుకోవాలి లేదా (ఎఫెసి 4:27) కోపం నిలిచి యున్నయెడల అపవాదికి చోటు ఇచ్చిన వారమగుదుము.
దేవుని పిల్లలము అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఏరకం కోపములో నేను ఉన్నాను అని తెలుసుకొని దేవుని యెదుట విఙ్ఞాపణ చేసుకొని దేవుని సమాధానము పొందుకొని ఆయనను స్తుతించుట మన విధియై యున్నది!