ఫలించు తీగెలు
(యొహాను 15:2 ) నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసిపారవేయును, ఫలించు ప్రతితీగె మరి యెక్కువగా ఫలింపవలెనని దానిలో పనికిరాని తీగెలను తీసివేయును.
దేవునిని ఎరుగనివారిని సహితము ప్రేమించి వాక్యముద్వారా విశ్వాసములో ఫలించువారినిగా తీర్చిదిద్దుచున్నాడు. మన జీవితములలో ఇహలోకశ్రమలు సంభవింపగానే వెంటనే ఆధ్యాత్మిక జీవితమును మరిచిపోయి ఉంటారు, అది మానవుల బలహీనత అని చెప్పవచ్చు, అయితే మనల నెరిగిన ప్రభువు మనజీవితములు ప్రభువునందు ఫలభరితముగా ఉండాలని ఇష్టపడుతూ మరియెక్కువగా ఫలించువారినిగా మెలుకొలుపుచున్నాడు. క్రీస్తునెరిగిన జీవితాలుగా జీవించాలి.
ద్రాక్షలో అంటుకట్టబడిన కొమ్మల్లాగా యుండాలని విశ్వాసులకు హెచ్చరికలు, ఎప్పుడైతే మన జీవితాలను ప్రభువులో అంటుకట్టబడి ఆయనకు సమర్పిస్తామో (యోహాను 15:5) ఎవడు నాయందు నిలిచి యుండునో నేను, ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా అనగా సమృద్ధిగా ఫలించును.
అందరు బహుగా ఫలించాలని తండ్రి కోరిక మన ఆధ్యాత్మిక జీవితములో ఫలితం అవసరము కొన్ని సంధర్భములలో సంతోషం ఎక్కువైనా లేక కష్టం ఎక్కువైన దేవున్ని మర్చిపోతాము, అది మానవనైజం , విశ్వాసులముగా మనము నిలిచి యుండాల్సిన చోటు ఒకటుంది అదేమనగా క్రీస్తులో నేను, నాలో క్రీస్తు ఉన్నప్పుడు మన జీవితం ఫలభరితముగా ఉంటుంది.
శరీరంలో అవయవములుగాను ఆయన పరిశుద్ధ ఆలయంలో రాళ్ళుగాను, క్రీస్తు కుటుంబములో సభ్యులుగాను ఎదుగుచూ తీగలుగా అభివృద్ధి పొందుదుముగాక !