ద్రాక్షవళ్ళి
(యోహాను 15:1)
నేను ద్రాక్షావళ్ళిని, నా తండ్రివ్యవసాయకుడు
ద్రాక్షపండ్లు అనినా అందరికి ఇష్టము, ద్రాక్ష మొక్క అనినాకూడా చాలామంది ఇష్టపడతారు, అందని ద్రాక్షపుల్లన అని అంటారు. ప్రాముఖ్యముగా ద్రాక్షరసము మనప్రభువైన యేసు క్రీస్తు రక్తమునకు సాదృశ్యము ద్రాక్షారసము ఆరోగ్యానికి కూడామంచిదిగా, ద్రాక్షారసము పవిత్రముగా కూడా భావిస్తాము.
అయితే ప్రభువు అంటున్నారు, నేను నిజమైన ద్రాక్షవళ్ళిని, తండ్రి వ్యవసాయకుడు, వ్యవసాయకుని పని ఫలింపని తీగలు, లేక కలుపు మొక్కలు, పనికి రాని మొక్కలు తీసిపార వేయుట.
ఇశ్రాయేలు ప్రజలను ద్రాక్షచెట్లతో పోల్చాడు దేవుడు ఆశించినట్లు వారు ప్రవర్తించలేదు. కావున ప్రభువు తానే మానవుల యెడల తనకున్న ప్రేమకై ఇలాగు చెప్పెను నేను నిజమైన ద్రాక్షావళ్ళిని అన్నారు. మన ఆధ్యాత్మిక జీవితమునకు ప్రజలపై శ్రద్ధ తీసుకుంటున్నారు. క్రీస్తు నెరిగిన జీవితం జీవించాలని ప్రభువునకు ఇష్టంలేని కార్యాలను తొలగించుకొని ప్రభువులో ఫలించు వారం కావాలి.
ద్రాక్షవళ్ళి ప్రభువు ఆయనలో నిలిచియుంటేనే గాని మన జీవితాలు ఫలించవు అందువలన ప్రభువు ప్రేమ అనే పొలములో మొక్కల్లాగా అంటుకట్టబడి యుండాలి. క్రీస్తులో మనం ఉన్నప్పుడు మనజీవితం ఫలభరితముగా ఉంటుంది, ఆ క్రీస్తు ప్రేమలో మనము తీగలుగా ఉండాలి.
ఆ క్రీస్తు సంఘములో ఆధ్యాత్మిక జీవితమును అలవరచుకోవాలి.
ఆ క్రీస్తు వాక్కులు మనజీవితమును సరిచేయును.
ఈ విధముగా మనము ద్రాక్షావళ్ళిలో అంటుకట్టబడి జీవించినపుడు
యోహాను 15:7 మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును, కావున ప్రభువులో నిలిచి మీ ప్రతి అక్కరను తీర్చుకొనుడి , ఆప్రభువే దయచేయును గాక ఆమెన్ !