నా కాపరి
మన ఆధ్యాత్మిక జీవితమునకు యేసుక్రీస్తు ప్రభువు కాపరిగా ఉన్నాడు, అందుకే భక్తుడైన దావీదు గొప్ప విశ్వాసముతో అంటున్నాడు
(కీర్తన 23:1) యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు
దావీదు తన్నుతాను గొర్రెగా భావించుకొంటున్నాడు తండ్రి నీవు నాకు గొప్పకాపరివి, నేను గొర్రెనయ్యా నీవు నాకు కాపరిగా ఉన్నంత వరకు లేమి కలుగదు నన్ను వెల ఇచ్చి కొని పెంచావు నేను నీ గొర్రెను నీవు నా కాపరివి అని అంటున్నాడు నిజానికి క్రీస్తు విశ్వాసులంతా ఆ క్రీస్తు గొర్రెలే, స్వభావసిద్ధంగా గొర్రెలు కాకపోవచ్చు కాని దేవునికి లోబడి మన హృదయాంతరంగములలో నుండి వచ్చిన విశ్వాసం వలన మనము దావీదు వలె చెప్పగలము
యెహొవా నాకాపరి నాకు లేమి కలుగదు, నేను నీ గొర్రెను అని చెప్పగలము.
(యోహాను 10:1)1 నేను గొర్రెలకు మంచికాపరిని, మంచి కాపరి గొర్రెలకొరకు తన ప్రాణము పెట్టును .
యేసు క్రీస్తు పరలోకం నుండి భూమికి వచ్చినది సర్వమానవాళికి శాశ్వత జీవం, ఆత్మసంబంధమైన జీవం ఇవ్వాలని ఆయన కోరిక అందుకే తన ప్రాణమును దారపోయడం ద్వారా ఆయన తన గొర్రెలకోసం చేసిన గొప్ప ప్రాణత్యాగమును మనము నెమరు వేసుకొంటూ నా కాపరియైన యేసు తప్పిపోయిన గొర్రెలమగు మన కొరకు తన ప్రేమను వెల్లడి పరిచాడు.తండ్రియైన దేవుడు కుమారున్ని ప్రేమిస్తున్నాడు అయితే కుమారుడైన యేసుక్రీస్తు తండ్రి చిత్తప్రకారముగా నిన్ను నన్ను తప్పిపోయిన గొర్రెలమగు మనకోసం ప్రాణత్యాగం చేసి మనకు శాశ్వతజీవమిచ్చి పరమునకు మార్గము చూపించినాడు. తప్పిపోయిన గొర్రెవలె కాకుండ తప్పుతెలిసిన గొర్రెలవలె ప్రభువును వెంబడించి మన జీవితాలు చక్కపరచుకొందాము!