సత్యమనుదట్టి
ఎఫేసి 6:14 ఎలాగనగా మీనడుమునకు సత్యమను దట్టి కట్టుకొనుడి. క్రైస్తవ బిడ్డలుగా దేవుని నమ్మిన ప్రియులందరు చేయాల్సినది ఏమిటని ఆలోచిస్తే విశ్వాసి జీవితంలో సత్యమే అన్నిటికి ఆధారం. మన జీవితంలో సత్యం పలుకుతూ సత్యవర్తనుడై జీవించాలి సత్యమే మనలను యధార్ధవంతులనుగాను, బలవంతులనుగాను చేస్తుంది. మానవులలో సత్యం లేనట్లైన భయంతో కూడిన జీవితం, యధార్థత లేని జీవితం, బలహీనపడి చింతాక్రాంతులై ఇంకను నిస్సాహస్థితిలో చేరుకొంటారు. యోహాను 8 : 32 సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయును, సత్యం పాపబంధకములలో నుండి విడుదల, నెమ్మది, విశ్రాంతి కలిగి యుంటాము. కనుక సత్యమును అనుసరించి నదుచుకొనవలెను. దేవుడు మన అంతః రంగములో సత్యం చూచేవాడు నీవు నేను నమ్మిన దేవుడు సత్యవంతుడు కాబట్టి మనము కూడా అలానే ఉండాలని కోరే దేవుడు ఎల్లప్పుడు సత్యమును హృదయములొ భధ్రపరచుకోవాలి దేవునిని ఆరాధించునపుడు సత్యంతో ఆరాధించాలి కావున సత్యం అను దట్టి ద్వారా ఎన్నో లాభాలు ఉన్నవి. సత్యం అనుదట్టి కట్టుకొని జీవించుదాము. పనులు చేయునపుడు బలంగా ఉండుటకు నడుమునకు వెడల్పైన వస్త్రమును గట్టిగా కట్టుకొని పనులు చేస్తారు అది వారికి బలమును ఇస్తుంది. ఆధ్యాత్మిక జీవితంలో దేవుని వాక్యమే సత్యం, సత్యమనే బెల్టు నడుముకు పేట్టుకోవడమంటే మనకు మనమే బైబిలులోని సత్యవాక్కులను మన హృదయములో నింపుకొని ప్రభువు ప్రియ బిడ్డలుగా జీవించి ఆ ప్రియ ప్రభువు కృపను పొందుకొందుముగాక ఆమెన్ ! |