సత్యమనుదట్టి
ఎఫేసి 6:14 ఎలాగనగా మీనడుమునకు సత్యమను దట్టి కట్టుకొనుడి. క్రైస్తవ బిడ్డలుగా దేవుని నమ్మిన ప్రియులందరు చేయాల్సినది ఏమిటని ఆలోచిస్తే విశ్వాసి జీవితంలో సత్యమే అన్నిటికి ఆధారం. మన జీవితంలో సత్యం పలుకుతూ సత్యవర్తనుడై జీవించాలి సత్యమే మనలను యధార్ధవంతులనుగాను, బలవంతులనుగాను చేస్తుంది. మానవులలో సత్యం లేనట్లైన భయంతో కూడిన జీవితం, యధార్థత లేని జీవితం, బలహీనపడి చింతాక్రాంతులై ఇంకను నిస్సాహస్థితిలో చేరుకొంటారు. యోహాను 8 : 32 సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయును, సత్యం పాపబంధకములలో…