కరుణాసంపన్నుడు

(ఎఫెసి 2:4) అయినను దేవుడు కరుణాసంపన్నుడైయుండి మనము మన అపరాధముల చేత చచ్చినవారమై యుండినపుడు సహితము మనయెడలచూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మానవులమైన మనము తోటి వారిని గుర్తించి నాలుగు మంచి మాటలు చెప్పడము  చాల కష్టం, మంచిని అసలు గుర్తించలేము. దేవుని ఙ్ఞానం తోడుంటే తప్ప మంచిని గుర్తించలేము. అయినను మనము విశ్వసించిన మనప్రభువైన యేసుక్రీస్తు కరుణాసంపన్నుడు,  ఆ ఒక్క పేరే కాదు దయగలవాడు, ప్రేమగల దేవుడు, కృపచూపువాడు అని…

విశ్వాసమను డాలు

ఎఫెసి 6:16   ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మనము శరీరరీత్యా బలహీనులుముగా ఉన్నప్పుడు డాక్టర్ ఏమందులు వాడమనిన తప్పకుండ అన్ని వాడుతాము. ఎందుకు అంటే ఆ మందుల వలన కాస్త శక్తిమంతులము అవుతామని ఆశ, మానవులముగా అందరము ఈ లోక సుఖం, సంపద, సౌఖ్యం కోరి అన్ని జరిగిస్తాము అన్ని మంచివే కాని ఒక్కటి మరచిపోతాము. అది ఆధ్యాత్మిక పోరాటము గురించి మరచిపోతాము, అందుకే భక్తుడు గుర్తు చేస్తున్నాడు,…

సిద్దమనస్సను జోడి

ఎఫెసి 6:15 పాదములకు సమాధానసువార్తవలనైనసిద్దమనస్సను జోడు తొడుగుకొని నిలువబడుడి. పౌలుగారు ఆధ్యాత్మిక పాఠాలు నేర్పుచున్నారు, సిద్దమనస్సను జోడు ఎందుకనినా అపవాదిని ఎదిరించుటకు ధైర్యంగా నిలువబడుటకు అధ్యాత్మిక పాదాలకు శుభవార్త అనే చెప్పులు తొడుగుకొని, శుభవార్తను అర్థం చేసుకోవాలి, నమ్మాలి,విశ్వసించాలి, వాక్యన్ని ప్రేమించి అనగా దేవున్ని ప్రేమించాలి. మన జీవితాల్లో కూడా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, ఆ ప్రభువు శాంతి, సమాధాన ధాతగా మనకుంటారు. మనకు సమాధానము ప్రభువే విశ్వాసులకు ఇతరులకు మధ్య సమాధానము ప్రభువే మనందరి…

సర్వశక్తి గల దేవుడు

ఆది 17:1 అబ్రాము తొంబది తొమ్మిది యేండ్లవాడైనపుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను; నా సన్నిధిలో నడుచుచూ నిందారహితుడువై యుండుము. దేవుడు తన్నుతాను ప్రత్యక్షపరచుకొని అబ్రాముతో మాట్లాడినాడు. 1. మొదటిగా నేను సర్వశక్తి గల దేవుడను అన్నాడు, నిజముగానే మనదేవుడు సర్వశక్తుడు, అనగా అసాధ్యాలను సాధ్యం చేయగలడు, తన వాగ్ధానములను నిలబెట్టుకోగలడు, తన పిల్లలకు ఏమి చెయ్యాలను కుంటాడో చేయగల అన్నిటికి చాలిన దేవుడు. 2. కాబట్టి నాసన్నిధిలో నడుచుచు అనగా దేవునికి ప్రియమైన…

దేవుని వాక్యము

ఎఫేసి 6:17   దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ ఖడ్గమును ఉపయోగించుటకు ముందుగా సమస్త విధములైన ఙ్ఞానముతో కూడిన క్రీస్తు వాక్యము సమృద్ధిగా మన హృదయంలో నింపుకోవాలి, ఆత్మీయ స్థితిలో ఎదురయ్యే విషమ పరీక్షల్లో దేవుని వాక్యము ఉపయోగించాలి, అనగా మన హృదయంలో సమృద్ధిగా దేవుని వాక్కు చేత నింపుకోవాలి.ఇహలోకంలో ఖడ్గాన్ని ఎందుకు వాడతారు, అనగా ప్రాణాన్ని రక్షించుకోడానికి శత్రువును ఎదిరించుటకు ఆపద ఎదురైనపుడు, ఉపయోగించుటకు తమ దగ్గర భద్రపరచుకొంటారు. దేవుని వాక్యము చేత యేసుప్రభువు…

ప్రధాన యాజకుడు

హెబ్రీ 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహనుభవము లేనివాడుకాడు గాని సమస్త విషయములలోను మన వలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. మనకు బలహీనతలు ఉండవలసిన వాటికన్న ఎక్కువగా ఉంటాయి ప్రతిపనులు చేస్తూ బలహీనపడిపోయి చింతిస్తూ, బాధపడుతూ కృంగిపోతుంటాము, మనలను ఎరిగిన మన ప్రధానయాజకుడు మన ప్రభువు మానవుల యొక్క భయభీతి దుఃఖ బాధలు అవసరతలు అన్ని యెరిగి తండ్రికి మన పక్షాన విన్నవించగల మన ప్రధానయాజకుడు యేసు క్రీస్తు. భూలోకంలో…

మిమ్మును మీరు తగ్గించుకొనుడి

యాకోబు 4:10   “ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడాయన మిమ్మును హెచ్చించును.” యేసు ప్రభువు చేయని నేరములను తనపై మోపి, ఒక నిర్ధొషిని దోషిగా పిలాతు ఎదుట నిలువబెట్టినపుడు, యేసు ప్రభువు కోపాన్ని వ్యక్తపరిచడ, లేదా? నేను దొషిని కాను అని నిరూపించుకొనుటకు ప్రయత్నించడ? లేక శాంత స్వభావముగలవాడై, తన్ను తాను తగ్గించుకొనినవాడై పిలాతు అడిగినవాటికి సమాధానమిచ్చాడ? యేసు మాటలాడిన విధానమేమిటో ఆనాటి శిష్యులకును మనకును తెలుసు, కావున మనము కూడా అదే విధముగా సమాధానం…

ఆధరించు దేవుడు

ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికి శుభములు. వేసవి కాలమంతా క్షేమంగా మనందరిని కాపాడి వర్షాకాలంలో ప్రవేశింప చేసిన యేసుక్రీస్తు ప్రభువుకు కృతఙ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. గడచినకాలం ఆధరించిన దేవుడు మీ జీవితంలో చేసిన మేలులను ఙ్ఞాపకము చేసుకొండి, ఎందుకనగా దేవుడు చేసిన మేలులకు మనము ఏమియు చెల్లించలేము, ప్రభువును ధ్యానించి స్తుతించే వారముగా ఉండాలని ప్రభువు మన కొరకు ఎదురు చూస్తున్నారు. దానియేలు 6:10 లో భక్తి పరుడైన దానియేలు గురించి ఆలోచిద్దాము, రాజగు నెబుకద్నెజరు ఒక శాసనము…

కృతఙ్ఞతా స్తుతులు చెల్లించుడి

ఎఫేసి 5:20 మన ప్రభువైన యేసు క్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతఙ్ఞత స్తుతుతులు చెల్లించుచు. ప్రభువును విశ్వసించే మన మందరము మన యెడల దేవుడు చేసిన ప్రతి విధమైన మేలులు, ఉపకారములు తలంచుకొంటూ, తండ్రికి స్తుతి చెల్లించు కోవాలి, మనము గ్రహించలేని సంగతులు మనజీవితంలో చేస్తూ మన జీవితాలను నడిపించుచున్న తండ్రికి కృతఙ్ఞతా స్తుతులు చెల్లించాలి. అనుదినము అన్న వస్త్రములచే పొషించుచున్నాడు, గనుక దేవునికి కృతఙ్ఞతా స్తుతులు చెల్లించాలి.ఈ జీవిత ప్రయాణములో…

భారము భరించువాడు

కీర్తనలు 68:19  ప్రభువు స్తుతి నొందునుగాక అనుదినము ఆయన మాభారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణ కర్తయైయున్నాడు. మనప్రభువు స్తుతులకు పాత్రుడు ఆయన అత్యున్నతుడు, ఉన్నతమైన సింహసనము నందు ఆసీనుడైయుండే ప్రభువు మన అందరిని అమితముగా ప్రేమించి ఈ పుడమిపై అరుదెంచినారు. అంతమాత్రమే కాదు గాని మనలను వెదకి రక్షించి అనుదినము మన భారము భరించుచున్నాడు. భూలోక రాజులను చూచినట్లైన రాజులు ప్రజలపై భారము మోపుతారు, కాని మనప్రభువు రాజలకు రాజు ఆ రాజులకు రాజైన ప్రభువు…

ఎవరు ధన్యులు

భూలోకములో నున్న తన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎన్నుకొన్నాడు. ఆయన పిల్లలమైన మనలను నిరంతరము కనిపెట్టి చూస్తున్నాడు, లోకమంతటా జరిగేవన్ని ఆయనకు తెలుసు ఒక్కొక్కరి జీవితాలను చూచే దేవుడు ఒకే సమయమందు అన్ని స్థలములలో గొప్ప కార్యములు చేయ గలడు. కీర్తనలు 33:12 యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఎకైక నిజ దేవుడు తమ దేవుడుగా ఉన్నవారు నిజముగా ధన్యులు ఇంతకన్న ఎక్కువ ధన్యత ఏదియు లేదు. మనము పేదరికములో ఉన్నను అపాయకరమైన స్తితిలో…

దేవుని జనులు

2దినవృత్తాంతములు 7: 14 నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును. దేవునికి ప్రియమైన జనులుగా (పిల్లలుగా) ఉండాలని అందరము ఇష్టపడుతాము అయితే ఆయన పిల్లలుగా ఎలా ఉండాలో వాక్యం మనకు బోధించుచున్నది. 1. మనలను మనము తగ్గించుకొని దేవుని సన్నిధానములో దీనులమై ఉండాలి, మన సృష్టి కర్తయైన దేవున్ని హెచ్చించుచు…