ఉచితమైన ప్రేమ

(2 కొరింథి 8:9) మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా ఆయన ధనవంతుడై యుండియు, మీరు తన దారిద్యము వలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను. మన ప్రభువైన యేసుక్రీస్తు మనందరికొరకు దరిద్రుడైనాడు, మనపట్ల తనకున్న ప్రేమను చూపించుటకు పరిపూర్ణమైన కృపచూపుటకు తనదంతయు మనకు ఇచ్చినాడు ప్రాముఖ్యముగా పరమ పవిత్రుడైన ప్రభువు అత్యున్నత మైన సింహాసనము విడచి మనల్ని ప్రేమించుట ద్వారా ఆ పరిశుద్దుడు పరిశుద్ధ స్థలము విడిచి ఈ భూలోకమందు అరుదెంచినాడు. విశ్వాసులందరికి…

ప్రభువు దృష్టికి

(2 పేతురు 3:8) ప్రియులారా ఒక సంగతి మరచిపోకుడి ఏమనగా ప్రభువు దృస్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెను వెయ్యిసంవత్సరములు ఒకదినము వలెను ఉన్నవి. ప్రభువు దృష్టికి మానవ దృష్టికి ఎంత వ్యత్యాసము కదా – భూమికి – ఆకాశము ఎంత ఎడమో, తూర్పు – పడమరలు ఎంతదూరమో. అలాగే ప్రభువు దృష్టి మానవ దృష్టి కూడా అంతే దూరము మన దృష్టి ఎంత అల్పమో చూశారా? అందుకే మనతోటి వారిని కూడా సరిగా అర్థం…

చింతయావత్తు

(1 పేతురు 5:7) ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింతయావత్తు ఆయన మీదవేయుడి. మానవులలో ఏదో ఒకరకమైన చింతద్వారా ఎప్పుడు నిరుత్సాహములో జీవితాలను కొనసాగించటం అలవాటు చేసుకొనియుంటారు, వాక్యం చదివినప్పటికిని ధ్యానించినప్పటికిని దేవునిపై భారము వేయకుండ ఇంకా అనేకమైన ఆలోచనలతో ఉంటారు. దేవున్ని విశ్వసించుతూ విశ్వాసప్రేమలతో జీవిస్తూ దేవునియందు భయభక్తి కలిగి యుంటూ మరొక ప్రక్క ఈలోకానుసారమైనచింతద్వార బలహీనులగుచుంటారు. మనందరి గురించిన ఆలోచన మన పరమతండ్రికి ఎల్లప్పుడు మనగురించిన ఎర్పాటులు చేస్తూ మనల్ని చూచుకొనుటకు…

దీనమనస్సు

(1 పేతురు 5:6) దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి. దేవుడు మనకు ఎప్పుడు ఏది అవసరము ఉంటుందో మనకంటే ఎక్కువుగా దేవునికి తెలుసు ఎప్పుడు ఎలా హెచ్చించాలో కూడా దేవునికే తెలియును, మనకు చిన్న సమస్య రాగానే ఎంతగానో కృంగిపోతాము మన బలిష్టుడైన దేవుని మరచిపోతాము. ప్రాముఖ్యముగా దేవుని బలిష్టమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుట అనగా, నమ్మక విశ్వాసము కలిగియుండాలి. స్థిరమైన నమ్మకముతో ఉండాలి. నేను సేవించుచున్న నా…

ప్రధానయాజకుడు

(హెబ్రీ 7:25) ఈయన తనద్యారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విఙ్ఞాపన చేయుటకు జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు. యేసు క్రీస్తు ప్రభువు మన ప్రధానయాజకుడు యాజకులందరికంటే శ్త్రేష్టమైనవాడు. మన నిమిత్తము నిరంతరము విఙ్ఞాపన చేయుచున్నాడు. క్రీస్తు యాజకత్యము శాశ్వతమైనది, ప్రభువును నమ్మిన ప్రతిఒక్కరి గురించి విఙ్ఞాపణలు చేయుచు తన పిల్లలను శాశ్వతముగా రక్షించ గలడు. ఎందుకనగా దేవునికి నరునికి మధ్యవర్తి మన ప్రభువైన యేసుక్రీస్తు మానవులమైన మన పాపాలకు ఒకే…

కరుణాసంపన్నుడు

(ఎఫెసి 2:4) అయినను దేవుడు కరుణాసంపన్నుడైయుండి మనము మన అపరాధముల చేత చచ్చినవారమై యుండినపుడు సహితము మనయెడలచూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మానవులమైన మనము తోటి వారిని గుర్తించి నాలుగు మంచి మాటలు చెప్పడము  చాల కష్టం, మంచిని అసలు గుర్తించలేము. దేవుని ఙ్ఞానం తోడుంటే తప్ప మంచిని గుర్తించలేము. అయినను మనము విశ్వసించిన మనప్రభువైన యేసుక్రీస్తు కరుణాసంపన్నుడు,  ఆ ఒక్క పేరే కాదు దయగలవాడు, ప్రేమగల దేవుడు, కృపచూపువాడు అని…

విశ్వాసమను డాలు

ఎఫెసి 6:16   ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మనము శరీరరీత్యా బలహీనులుముగా ఉన్నప్పుడు డాక్టర్ ఏమందులు వాడమనిన తప్పకుండ అన్ని వాడుతాము. ఎందుకు అంటే ఆ మందుల వలన కాస్త శక్తిమంతులము అవుతామని ఆశ, మానవులముగా అందరము ఈ లోక సుఖం, సంపద, సౌఖ్యం కోరి అన్ని జరిగిస్తాము అన్ని మంచివే కాని ఒక్కటి మరచిపోతాము. అది ఆధ్యాత్మిక పోరాటము గురించి మరచిపోతాము, అందుకే భక్తుడు గుర్తు చేస్తున్నాడు,…

సిద్దమనస్సను జోడి

ఎఫెసి 6:15 పాదములకు సమాధానసువార్తవలనైనసిద్దమనస్సను జోడు తొడుగుకొని నిలువబడుడి. పౌలుగారు ఆధ్యాత్మిక పాఠాలు నేర్పుచున్నారు, సిద్దమనస్సను జోడు ఎందుకనినా అపవాదిని ఎదిరించుటకు ధైర్యంగా నిలువబడుటకు అధ్యాత్మిక పాదాలకు శుభవార్త అనే చెప్పులు తొడుగుకొని, శుభవార్తను అర్థం చేసుకోవాలి, నమ్మాలి,విశ్వసించాలి, వాక్యన్ని ప్రేమించి అనగా దేవున్ని ప్రేమించాలి. మన జీవితాల్లో కూడా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, ఆ ప్రభువు శాంతి, సమాధాన ధాతగా మనకుంటారు. మనకు సమాధానము ప్రభువే విశ్వాసులకు ఇతరులకు మధ్య సమాధానము ప్రభువే మనందరి…

సర్వశక్తి గల దేవుడు

ఆది 17:1 అబ్రాము తొంబది తొమ్మిది యేండ్లవాడైనపుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను; నా సన్నిధిలో నడుచుచూ నిందారహితుడువై యుండుము. దేవుడు తన్నుతాను ప్రత్యక్షపరచుకొని అబ్రాముతో మాట్లాడినాడు. 1. మొదటిగా నేను సర్వశక్తి గల దేవుడను అన్నాడు, నిజముగానే మనదేవుడు సర్వశక్తుడు, అనగా అసాధ్యాలను సాధ్యం చేయగలడు, తన వాగ్ధానములను నిలబెట్టుకోగలడు, తన పిల్లలకు ఏమి చెయ్యాలను కుంటాడో చేయగల అన్నిటికి చాలిన దేవుడు. 2. కాబట్టి నాసన్నిధిలో నడుచుచు అనగా దేవునికి ప్రియమైన…

దేవుని వాక్యము

ఎఫేసి 6:17   దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ ఖడ్గమును ఉపయోగించుటకు ముందుగా సమస్త విధములైన ఙ్ఞానముతో కూడిన క్రీస్తు వాక్యము సమృద్ధిగా మన హృదయంలో నింపుకోవాలి, ఆత్మీయ స్థితిలో ఎదురయ్యే విషమ పరీక్షల్లో దేవుని వాక్యము ఉపయోగించాలి, అనగా మన హృదయంలో సమృద్ధిగా దేవుని వాక్కు చేత నింపుకోవాలి.ఇహలోకంలో ఖడ్గాన్ని ఎందుకు వాడతారు, అనగా ప్రాణాన్ని రక్షించుకోడానికి శత్రువును ఎదిరించుటకు ఆపద ఎదురైనపుడు, ఉపయోగించుటకు తమ దగ్గర భద్రపరచుకొంటారు. దేవుని వాక్యము చేత యేసుప్రభువు…

ప్రధాన యాజకుడు

హెబ్రీ 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహనుభవము లేనివాడుకాడు గాని సమస్త విషయములలోను మన వలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. మనకు బలహీనతలు ఉండవలసిన వాటికన్న ఎక్కువగా ఉంటాయి ప్రతిపనులు చేస్తూ బలహీనపడిపోయి చింతిస్తూ, బాధపడుతూ కృంగిపోతుంటాము, మనలను ఎరిగిన మన ప్రధానయాజకుడు మన ప్రభువు మానవుల యొక్క భయభీతి దుఃఖ బాధలు అవసరతలు అన్ని యెరిగి తండ్రికి మన పక్షాన విన్నవించగల మన ప్రధానయాజకుడు యేసు క్రీస్తు. భూలోకంలో…

మిమ్మును మీరు తగ్గించుకొనుడి

యాకోబు 4:10   “ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడాయన మిమ్మును హెచ్చించును.” యేసు ప్రభువు చేయని నేరములను తనపై మోపి, ఒక నిర్ధొషిని దోషిగా పిలాతు ఎదుట నిలువబెట్టినపుడు, యేసు ప్రభువు కోపాన్ని వ్యక్తపరిచడ, లేదా? నేను దొషిని కాను అని నిరూపించుకొనుటకు ప్రయత్నించడ? లేక శాంత స్వభావముగలవాడై, తన్ను తాను తగ్గించుకొనినవాడై పిలాతు అడిగినవాటికి సమాధానమిచ్చాడ? యేసు మాటలాడిన విధానమేమిటో ఆనాటి శిష్యులకును మనకును తెలుసు, కావున మనము కూడా అదే విధముగా సమాధానం…