సిద్దమనస్సను జోడి
ఎఫెసి 6:15 పాదములకు సమాధానసువార్తవలనైనసిద్దమనస్సను జోడు తొడుగుకొని నిలువబడుడి. పౌలుగారు ఆధ్యాత్మిక పాఠాలు నేర్పుచున్నారు, సిద్దమనస్సను జోడు ఎందుకనినా అపవాదిని ఎదిరించుటకు ధైర్యంగా నిలువబడుటకు అధ్యాత్మిక పాదాలకు శుభవార్త అనే చెప్పులు తొడుగుకొని, శుభవార్తను అర్థం చేసుకోవాలి, నమ్మాలి,విశ్వసించాలి, వాక్యన్ని ప్రేమించి అనగా దేవున్ని ప్రేమించాలి. మన జీవితాల్లో కూడా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, ఆ ప్రభువు శాంతి, సమాధాన ధాతగా మనకుంటారు. మనకు సమాధానము ప్రభువే విశ్వాసులకు ఇతరులకు మధ్య సమాధానము ప్రభువే మనందరి…
