భారము భరించువాడు
కీర్తనలు 68:19 ప్రభువు స్తుతి నొందునుగాక అనుదినము ఆయన మాభారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణ కర్తయైయున్నాడు. మనప్రభువు స్తుతులకు పాత్రుడు ఆయన అత్యున్నతుడు, ఉన్నతమైన సింహసనము నందు ఆసీనుడైయుండే ప్రభువు మన అందరిని అమితముగా ప్రేమించి ఈ పుడమిపై అరుదెంచినారు. అంతమాత్రమే కాదు గాని మనలను వెదకి రక్షించి అనుదినము మన భారము భరించుచున్నాడు. భూలోక రాజులను చూచినట్లైన రాజులు ప్రజలపై భారము మోపుతారు, కాని మనప్రభువు రాజలకు రాజు ఆ రాజులకు రాజైన ప్రభువు…