ఫలించు తీగెలు
(యొహాను 15:2 ) నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసిపారవేయును, ఫలించు ప్రతితీగె మరి యెక్కువగా ఫలింపవలెనని దానిలో పనికిరాని తీగెలను తీసివేయును. దేవునిని ఎరుగనివారిని సహితము ప్రేమించి వాక్యముద్వారా విశ్వాసములో ఫలించువారినిగా తీర్చిదిద్దుచున్నాడు. మన జీవితములలో ఇహలోకశ్రమలు సంభవింపగానే వెంటనే ఆధ్యాత్మిక జీవితమును మరిచిపోయి ఉంటారు, అది మానవుల బలహీనత అని చెప్పవచ్చు, అయితే మనల నెరిగిన ప్రభువు మనజీవితములు ప్రభువునందు ఫలభరితముగా ఉండాలని ఇష్టపడుతూ మరియెక్కువగా ఫలించువారినిగా మెలుకొలుపుచున్నాడు. క్రీస్తునెరిగిన జీవితాలుగా జీవించాలి….
